కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.

4వ డివిజన్‌లో రూ.78 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ.

కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.

కరీంనగర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని 4వ డివిజన్‌లో బుధవారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

దుర్షెడ్‌–గోపాల్‌పూర్‌ రోడ్డులో రూ.78 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ భూపతి రవీందర్, పలువురు కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. యూఐడీఎఫ్ నిధులతో పాటు ఇతర గ్రాంట్ల ద్వారా నగరపాలక సంస్థ పాలకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. త్వరలో యూసీఎఫ్ నిధులతోనూ నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!