హరీష్‌రావు పర్యటనను విజయవంతం చేయాలి.
పెద్దమందడి మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి.
పెద్దమందడి,అక్టోబర్27(తెలంగాణ ముచ్చట్లు)
నవంబర్ 2న వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని పెద్దమందడి మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి, పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్న రైతులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు హరీష్‌రావు పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు.పర్యటనను విజయవంతం చేసేందుకు పెద్దమందడి, అడ్డాకల్ మండలాల పరిధిలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఈ నెల 28న బుధవారం ఉదయం 9:30 గంటలకు వెల్టూర్ గ్రామంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని వెల్లడించారు.అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సంబంధిత గ్రామాల సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు సమావేశానికి సకాలంలో హాజరై పర్యటన విజయవంతానికి సహకరించాలని రఘుపతిరెడ్డి కోరారు.


Comments