సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.

సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.

*మాజీ మున్సిపల్ చైర్మన్ సేవలు ఆదర్శప్రాయం*

*ఘనంగా జన్మదిన వేడుకలు.. ప్రజాకవి డాక్టర్ నాగుల సత్యంగౌడ్ ప్రశంసలు*

హుజూరాబాద్‌, అక్టోబర్ 27(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ అందించిన నిస్వార్థ ప్రజాసేవలు అందరికీ ఆదర్శప్రాయమని మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్ కొనియాడారు. ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకొని, ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తూ, తనవంతు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ప్రశంసించారు.
మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాలులో మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగుల సత్యంగౌడ్ విజయ్‌కుమార్‌కు పట్టు శాలువా కప్పి, ఆధ్యాత్మిక కవితా జ్ఞాపిక, పూలబొకే అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేయించి, మిఠాయిలు తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు
ఈ సందర్భంగా డాక్టర్ నాగుల సత్యంగౌడ్ మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, పేదలకు తనవంతు సాయం అందిస్తూ ముందుకు సాగుతున్న విజయ్‌కుమార్ సేవలు ప్రశంసనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా తన పదవీకాలంలో హుజూరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేసి, పట్టణానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు.
నాయకులు పదవులకే పరిమితం కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే నాయకులకు నిజమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని అన్నారు. సమాజంలో మానవీయ విలువలను కాపాడుతూ, స్వార్థాన్ని వీడి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తోటి మనుషులకు చేతనైన సహాయం చేయడం ద్వారా మానవ జన్మను సార్థకం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
పలువురి అభినందనలుఈ జన్మదిన వేడుకల్లో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రాన్, బండ నవీన్, బొడ్డు సంజయ్, తునికి వసంత్, నందగిరి శ్రీనివాస్, బాబురావు, వెంకటస్వామి, శాయిల రాజు, జడల సమ్మయ్య, చందు, ముకుందరెడ్డి, రాజుగౌడ్, బాలాజీ తదితరులు పాల్గొని వడ్లూరి విజయ్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!