నమిలిగొండలో విషాదం...

13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.

నమిలిగొండలో విషాదం...

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల గుండె రిత్విక్ అనే బాలుడు ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో చోటుచేసుకుంది. మృతుడి తల్లి గుండె స్వప్న కథనం ప్రకారం తాను కూలికి వెళ్లి వచ్చేసరికి తన కుమారుడు ఇంట్లో లోపలి నుండి గడియ పెట్టుకుని తలుపులు వేయడంతో, ఎంత పిలిచినా పలకకపోవడంతో, చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా లోపల తమ కుమారుడు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని శివమై కనిపించాడని, తమ కుమారుడి మృతిపై అనుమానం ఉందని, అసలు కారణాలను వెలికి తీయాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!