విధి నిర్వహణలో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి.. తీవ్ర గాయాలు.

విధి నిర్వహణలో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి.. తీవ్ర గాయాలు.

గాయపడిన ప్రవల్లికకు హైదరాబాద్‌లో ప్రత్యేక వైద్యం.. 

ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్

ఖమ్మం బ్యూరో , అక్టోబర్ 27(తెలంగాణ ముచ్చట్లు )

మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవల్లికపై మహిళా ప్రయాణికురాలు దాడి చేసి, బస్సు నుంచి బయటకు నెట్టివేసిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో ప్రవల్లిక కాలికి తీవ్ర గాయాలై, పరిస్థితి బాధాకరంగా మారింది. 2026 అక్టోబర్ 25, ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై స్పందించిన ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్, గాయపడిన కండక్టర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. ఆమెనుమణుగూరు డిపో కండక్టర్ ప్రవల్లిక పై ఒక మహిళా ప్రయాణికుల దాడి చేసి బస్సులో నుంచి బయటకు నెట్టడం వల్ల కండక్టర్ యొక్క కాలు బాగా మొత్తం బాగా నలిగి పోవడం వల్ల, ఆ కండక్టర్ ని ఖమ్మం రీజినల్ మేనేజర్ హుటాహుటిన హైదరాబాద్ లోని సాయి సంజీవిని హాస్పిటల్ కి ప్రత్యేక వైద్యం కోసం పంపించి.

     హాస్పిటల్ కి వెళ్లి కండక్టర్ ప్రవల్లికను ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్ పరామర్శించడం జరిగింది. ప్రత్యేక చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సాయి సంజీవిని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు.

అనంతరం ఆసుపత్రికి వెళ్లిన రీజినల్ మేనేజర్ సరి రామ్, చికిత్స పొందుతున్న ప్రవల్లికను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు.

విధి నిర్వహణలో ప్రజలకు సేవలందించే ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు జరగడం విచారకరం. ఉద్యోగుల భద్రతకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను అరికట్టి, విధి నిర్వహణలో వారికి భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!