అనంతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

అనంతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

*రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.*

మానకొండూర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో ఇల్లంతకుంట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, సహకార సంఘం ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!