చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!

చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!

హుండీ ద్వారా రూ.13.12 లక్షల ఆదాయం.. 

జపాన్, ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లు లభ్యం

చిల్పూర్,అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిల్పూర్ గుట్ట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలతో భారీ ఆదాయం సమకూరింది. మంగళవారం ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించగా, మొత్తం రూ.13,12,101 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ నల్గొండ జోన్ పర్యవేక్షకులు ఎన్. నిఖిల్ ఆధ్వర్యంలో మొత్తం 10 హుండీలను లెక్కించారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు మిశ్రమ వెండి, బంగారు కానుకలు కూడా లభ్యమయ్యాయి.

ఈ లెక్కింపులో జపాన్, ఇంగ్లాండ్‌తో పాటు ఆఫ్రికా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామివారిపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి హుండీ ఆదాయం నిదర్శనంగా నిలుస్తోందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బి. లక్ష్మీ ప్రసన్న, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీధర్ రావు, డైరెక్టర్లు వేముల వెంకటేశ్వర్లు, గోలి రాజశేఖర్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!