బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.

సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ఎస్‌ఐ జి. నరేష్

ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు )

దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ సూచించారు. బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
దుకాణాల వద్ద ఇసుక, నీటి డ్రమ్ములను అందుబాటులో ఉంచుకోవాలని, అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే నియంత్రించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దుకాణాల సమీపంలో ఎవరూ సిగరెట్‌, బీడీలు తాగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాణాసంచా దుకాణాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయాలు నిర్వహించినా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా సంబంధిత దుకాణదారులపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్‌ఐ నరేష్ హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.