మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తా.. షేక్ హుస్సేన్.
ఏదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డులో ఘనంగా సన్మాన కార్యక్రమం.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 9(తెలంగాణ ముచ్చట్లు )
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ముస్లిం మైనార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా షేక్ హుస్సేన్ మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి దృష్టికి మైనార్టీల సమస్యలను తీసుకెళ్లి, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు షేక్ నజీరుద్దీన్, కాంగ్రెస్ పార్టీ ఏదులాపురం మున్సిపాలిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ పాషా, రెండో వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు మహేష్, రెండో వార్డు కార్యదర్శి యాకూబ్ పాషా, మజీద్ సదర్ గని, నాయబ్ సదర్ సోందుమియా ఖాన్, రఫీ, జావిద్, సందాని, షేక్ అఫ్జల్, షేక్ వలి సాబ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షేక్ హుస్సేన్‌కు పలువురు మైనార్టీ పెద్దలు, స్థానిక నాయకులు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.


Comments