వీఓఏగా శ్రీధర్ ను తిరిగి నియమించాలి.

జిల్లా కలెక్టర్‌కు మహిళల వినతి.

వీఓఏగా శ్రీధర్ ను తిరిగి నియమించాలి.

మహబూబ్‌నగర్,నవంబర్10(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్నగర్ అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామ సంఘం విఓఏగా దాదాపు 20 సంవత్సరాలుగా బాధ్యతాయుతంగా సేవలందిస్తున్న శ్రీధర్ పేరును తిరిగి నమోదు చేయాలని కోరుతూ గ్రామ మహిళలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.గ్రామ మహిళల కథనం ప్రకారం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గ్రామ సంఘం తీర్మానం లేకుండానే శ్రీధర్ పేరును అధికారులు తొలగించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ మహిళలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని, శ్రీధర్‌ను తిరిగి విఓఏగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ మేరకు పెద్ద సంఖ్యలో మహిళలు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గ్రామ సంఘం మహిళల అంగీకారం లేకుండా విఓఏ పేరును తొలగించడం సరికాదని, వెంటనే శ్రీధర్ పేరును తిరిగి నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మండల ప్రాజెక్టు అధికారి మహేష్‌ను మహిళలు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన, తాను శ్రీధర్ పేరును తొలగించలేదని, గ్రామంలో విచారణ జరిపించాలని పై అధికారులకు నివేదిక అందించినట్లు వివరించారు.శ్రీధర్ పేరును తిరిగి నమోదు చేయకపోతే రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మహిళలు హెచ్చరించారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు గ్రామంలో రుణాల చెల్లింపులు నిలిపివేస్తామని అధికారులకు స్పష్టం చేశారు.దాదాపు రెండు దశాబ్దాలుగా తమ గ్రామ సంఘానికి సేవలందిస్తున్న శ్రీధర్‌ను తిరిగి విఓఏగా కొనసాగించాలని, తమకు న్యాయం చేయాలని గ్రామ మహిళలు జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శివనామస్మరణతో మార్మోగిన ఆలయం.. ఆకాశదీప కార్యక్రమానికి శ్రీకారం! శివనామస్మరణతో మార్మోగిన ఆలయం.. ఆకాశదీప కార్యక్రమానికి శ్రీకారం!
ఎల్కతుర్తి, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో కార్తీకమాస ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశదీప కార్యక్రమాన్ని ఘనంగా...
వీఓఏగా శ్రీధర్ ను తిరిగి నియమించాలి.
నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.
భూ రికార్డుల్లో మాయాజాలమా?.. కొనుగోలుదారుడి భూమిపై ఇతరుల పట్టా!
మహిళల రక్షణ, సైబర్ నేరాలపై విద్యార్థినీలకు అవగాహన.
నగర అభివృద్ధికి బండి సంజయ్ ప్రత్యేక కార్యాచరణ.
టీడీపీ గౌస్‌ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు.