శివనామస్మరణతో మార్మోగిన ఆలయం.. ఆకాశదీప కార్యక్రమానికి శ్రీకారం!

శివనామస్మరణతో మార్మోగిన ఆలయం.. ఆకాశదీప కార్యక్రమానికి శ్రీకారం!

ఎల్కతుర్తి, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో కార్తీకమాస ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశదీప కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.

కార్తీకమాసం సందర్భంగా నెలరోజుల పాటు ప్రతిరోజూ సాయంకాలం ఆలయంలో ఆకాశదీప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ.. కార్తీకమాసంలో నిర్వహించే ఆకాశదీప కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.

కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ గంజి భవనరుషి, రాకేష్, అశోక్, విజయశ్రీ, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శివనామస్మరణతో మార్మోగిన ఆలయం.. ఆకాశదీప కార్యక్రమానికి శ్రీకారం! శివనామస్మరణతో మార్మోగిన ఆలయం.. ఆకాశదీప కార్యక్రమానికి శ్రీకారం!
ఎల్కతుర్తి, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో కార్తీకమాస ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశదీప కార్యక్రమాన్ని ఘనంగా...
వీఓఏగా శ్రీధర్ ను తిరిగి నియమించాలి.
నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.
భూ రికార్డుల్లో మాయాజాలమా?.. కొనుగోలుదారుడి భూమిపై ఇతరుల పట్టా!
మహిళల రక్షణ, సైబర్ నేరాలపై విద్యార్థినీలకు అవగాహన.
నగర అభివృద్ధికి బండి సంజయ్ ప్రత్యేక కార్యాచరణ.
టీడీపీ గౌస్‌ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు.