నగర అభివృద్ధికి బండి సంజయ్ ప్రత్యేక కార్యాచరణ.
*నగరంలోని ప్రతి గల్లీలో ఏడాదిలోపు అంతర్గత రహదారుల నిర్మాణం.*
*నగర సమగ్ర అభివృద్ధికి ప్రజలు సహకరించాలి..కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.*
కరీంనగర్, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ ప్రయత్నానికి ప్రజలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి గల్లీలో ఏడాదిలోపు అంతర్గత రహదారులను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం 50వ డివిజన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌లతో కలిసి జ్యోతినగర్ ప్రాంతంలో రూ.79 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న ఆర్‌సీసీ డ్రైన్, స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments