హుజూరాబాద్‌లో ఘనంగా ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ.

హుజూరాబాద్‌లో ఘనంగా ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ.

*ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో కాంగ్రెస్ శ్రేణుల పిలుపు*

*కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యం: ఒడితల ప్రణవ్ బాబు*

హుజూరాబాద్, అక్టోబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్ పట్టణంలో ‘చలో ఢిల్లీ.. ఓటు బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సజ్జద్ మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితల ప్రణవ్ బాబు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఒడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ‘చలో ఢిల్లీ.. ఓటు బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
యువత రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ ఉపాధ్యక్షుడు మొలుగూరి సదయ్య, డీసీసీ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్, హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు సొల్లు సునీత బాబు, వెంకటస్వామి నాయక్, పొనగంటి మల్లయ్య, బోయినపల్లి ఉమాపతిరావు, గంట కిరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శులు రేవంత్, గంగారపు మహేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తెలకుంట్ల ప్రశాంత్, పాతకాల ప్రవీణ్, సామల రాజిరెడ్డి, కిట్టు రెడ్డి, ప్రణయ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.