పల్లెల్లో పండుగవై శీనన్న.. జన్మదిన వేళ ప్రత్యేక గేయం!
* మంత్రి పొంగులేటిపై అభిమానంతో పాట రూపకల్పన
* క్యాంపు కార్యాలయంలో గేయావిష్కరణ
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 28(తెలంగాణ ముచ్చట్లు )
పల్లెల్లో పండుగై.. ప్రజల గుండెల్లో అభిమానమై నిలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక గేయాన్ని రూపొందించారు. ‘పల్లెల్లో పండుగవై శీనన్న..’ పల్లవితో సాగే ఈ పాటను బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
బంజారా రమేష్ ఆలపించిన ఈ ప్రత్యేక గేయాన్ని సాంస్కృతిక విభాగం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ కానుగుల రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కళాకారులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రి పొంగులేటిపై అభిమానంతో ప్రత్యేక పాటను రూపొందించడం అభినందనీయమన్నారు. జన్మదిన వేళ పాట రూపంలో తమ అభిమానాన్ని చాటుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం కానుగుల రాధాకృష్ణతో పాటు పలువురు కళాకారులు తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేశారు.


Comments