చెరువు కబ్జా ఆరోపణలు.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం!

చెరువు కబ్జా ఆరోపణలు.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం!

-55 ఎకరాల చెరువు శివారులో అక్రమంగా చదును చేశారంటూ ఆరోపణలు.. 

-250 ఎకరాల సాగుకు ముప్పు

 ఎల్కతుర్తి అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు);

ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ చెరువు భూమి ఆక్రమణ ఆరోపణలపై తిమ్మాపూర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు శివారులో భూమిని చదును చేసి మొరం పోస్తున్నా అధికారులు ముందస్తుగా ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. చెరువు భూమిని కాపాడి, ఆక్రమణ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గుంటూరుపల్లె గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ శివారులోని ఊర చెరువు పరిధిలో పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించడంతో పాటు బోరు కూడా ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఇటీవల దసరాకు నాలుగు రోజుల ముందు చెరువు శివారులోని భూమిని చదును చేసి మొరం పోయడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ తిమ్మాపూర్ సర్పంచ్ ముప్పు మానస మహేందర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సదానందం, జీపీ కృష్ణ బుధవారం వివాదాస్పద స్థలాన్ని పరిశీలించేందుకు గ్రామానికి వచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తిమ్మాపూర్ ప్రజలు, యువత తమ చెరువు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

250 ఎకరాల సాగుకు ఆధారమైన చెరువు

సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద దాదాపు 250 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉందని గ్రామస్తులు తెలిపారు. అలాంటి చెరువు పరిధిలో సుమారు రెండు ఎకరాల భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చెరువు భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు.

గ్రామంలో నీటి ఎద్దడి.. పక్క గ్రామం నుంచి నీటి తరలింపా?

తిమ్మాపూర్‌లో ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే, తమ గ్రామ శివారులో బోరు వేసి నీటిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో సాగునీటితో పాటు గ్రామ ప్రజల నీటి అవసరాలకూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులు స్పందించాలి

చెరువు అసలు విస్తీర్ణాన్ని అధికారికంగా సర్వేIMG-20261028-WA0004 చేసి హద్దులను నిర్ధారించాలని, చెరువు శివారులో భూమి చదును చేసి మొరం పోసిన వ్యవహారంపై విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆక్రమణ ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు భూమిని కాపాడాలని, భవిష్యత్తులో ఆక్రమణలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని తిమ్మాపూర్ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.