శీనన్న జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని

కాంగ్రెస్ శ్రేణుల విస్తృత సేవా కార్యక్రమాలు.

శీనన్న జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని

* ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో  రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 28(తెలంగాణ ముచ్చట్లు )

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శీనన్న అభిమానుల ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం, కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయాల్లో కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.IMG-20261028-WA0044రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టి అభిమానాన్ని చాటుకున్నారు.
*తల సేమియా బాధితుల కోసం రక్తదానం*
ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, సీనియర్ న్యాయవాది ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం తలసేమియా బాధితులకు ఉపయోగపడేలా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో 130 మంది రక్తదానం చేశారు. దాదాపు వెయ్యి మందికి అన్నదానం చేశారు.
*కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలోనూ..:* కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్నారు. క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మంది రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
*ప్రజల సంక్షేమమే ధ్యేయం*
ఈ సందర్భంగా ఖమ్మం, కూసుమంచి లలో జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రజానాయకుడని కొనియాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కృషి చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ‘ఇందిరమ్మ ఇళ్ల శీనన్న’గా గుర్తింపు పొందారని హర్షం వ్యక్తం చేశారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్యాంపు కార్యాలయాల వద్ద అభిమానులు ‘జై శీనన్న’ నినాదాలతో సందడి చేశారు.
*ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో..* కాంగ్రెస్ నాయకులు మద్ది శ్రీనివాసరెడ్డి, ఉమ్మినేని కృష్ణ, పైడిమర్ల అశోక్‌రెడ్డి, లింగాల రవికుమార్, తాళ్లూరి రాము, ఇనగిండ్ల నాగేశ్వరరావు, ఇమామ్ భాయ్, తదితరులు పాల్గొన్నారు.
 *కూసుమంచిలో..:* మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మంకెన వాసు, కార్యదర్శి హఫీజుద్దీన్, సీడీసీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.