ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!

ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!

- బట్టలు ఆరేస్తుండగా ప్రమాదం.
- కాపాడేందుకు వెళ్లిన తండ్రికి షాక్‌.

చండ్రుగొండ, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు): 

బట్టలు ఆరేస్తుండగా ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం కావడంతో షాక్‌కు గురై ఓ వివాహిత మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి కూడా విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర బ్రిక్స్‌ కంపెనీ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాకు చెందిన బాలు అర్జున్‌ కుటుంబం ఉపాధి నిమిత్తం గత ఆరు నెలలుగా సదరు బ్రిక్స్‌ కంపెనీలో పనిచేస్తూ అక్కడే నివాసముంటోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో బాలు అర్జున్‌ భార్య బాల రాజమణి (ఇరవై ఏడు) బట్టలు ఉతికి ఇనుప తీగపై ఆరేస్తుండగా, ఆ తీగకు విద్యుత్‌ ప్రసారం కావడంతో షాక్‌కు గురైంది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన తండ్రి దీనబంధుకు కూడా విద్యుత్‌ షాక్‌ తగిలి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో బాల రాజమణి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త బాలు అర్జున్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండ్రుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.