అర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.

అర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.

* ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
* భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టండి 
* పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచనలు 

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 28(తెలంగాణ ముచ్చట్లు )

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్‌ అర్నబ్ ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. వాతావరణ పరిస్థితులపై ఆరా తీశారు. రెండు జిల్లాల్లోనూ అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తుఫాన్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.