శివారు ప్రాంతాల అభివృద్ధికి మేయర్ పెద్దపీట.

మూడు డివిజన్లలో రూ.1.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

శివారు ప్రాంతాల అభివృద్ధికి మేయర్ పెద్దపీట.

కరీంనగర్, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ నగరంలోని విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం 20, 43, 60వ డివిజన్లలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మొత్తం రూ.1.15 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

నగరంలోని 20వ డివిజన్ రేకుర్తిలో నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.61 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 60వ డివిజన్ కాశ్మీర్ గడ్డలో యూఐడీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అదేవిధంగా 43వ డివిజన్ గోదాంగడ్డలో నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.14 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను మేయర్ పరిశీలించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగర ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు పర్వతం మల్లేషం, సుధగోని మాధవిIMG-20261028-WA0030 కృష్ణ గౌడ్, నస్రీమ్ సుల్తానా, పొన్నం లక్ష్మీ మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.