శ్రీ యజ్ఞవరాహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం.

యాదగిరి సునీల్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు.

శ్రీ యజ్ఞవరాహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం.

కరీంనగర్, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్‌లోని సర్వవైదిక సంస్థానమ్ ట్రస్ట్, యజ్ఞవరాహ క్షేత్రంలో శ్రీ యజ్ఞవరాహస్వామి 40వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ బుధవారం నుంచి నవంబర్ 2వ తేదీ సోమవారం వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావును ఆలయ కమిటీ సభ్యులు ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరేందర్, వెంకట్రాములు, వెంకటేశ్వరరెడ్డి, రాణి, రవీందర్ రావు పాల్గొని ఆహ్వానాన్ని అందజేశారు.

శ్రీ యజ్ఞవరాహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.