మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.
దమ్మపేట, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని దమ్మపేట మండల కేంద్రంలోని శ్రీ వినాయక ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర మాజీ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు సారథ్యంలో, ఆయన కుమారుడు ధనుష్ ప్రణవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరయ్యారు. శిబిరంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతకుముందు మందలపల్లి సాయిబాబా మందిరంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం మందలపల్లి సెంటర్‌లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని జన్మదిన వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments