గంగారం బెటాలియన్‌లో వెపన్ షో.!
పోలీసు ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన.
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్ షో (ఓపెన్ హౌస్) నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ పెద్దబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంగారం డీఏవీ, సత్తుపల్లి విశ్వశాంతి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెటాలియన్ పోలీసు సిబ్బంది వివిధ రకాల పోలీసు ఆయుధాలను విద్యార్థులకు పరిచయం చేశారు. వాటి పనితీరు, వినియోగ విధానం, పోలీసు విధుల నిర్వహణలో వాటి ప్రాధాన్యాన్ని వివరించారు. పోలీసు శాఖ విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, భద్రతా వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ పెద్దబాబు మాట్లాడుతూ.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత స్థానాలను అధిరోహించి దేశసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు వేణుగోపాల్‌రెడ్డి, వినాయకరావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఉదయకుమార్, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, బెటాలియన్ శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.


Comments