పొంగులేటి మంత్రుల్లో ప్రథముడు.

డాక్టర్ పిడమర్తి రవి

పొంగులేటి మంత్రుల్లో ప్రథముడు.

పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న పొంగులేటి 

హైదరాబాద్,అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హిమాయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ రామన్ గౌడ్ ఆధ్వర్యంలో మేలుకోటి పార్కు సమీపంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో డాక్టర్ పిడమర్తి రవి పాల్గొని మాట్లాడారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రైతు నేస్తం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా నాయకులు “లాంగ్ లివ్ పొంగులేటి” అంటూ నినాదాలు చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోరెల్లి సురేష్, నక్క మహేష్, ఎండీ రహీం, చైతన్య, జోగు గణేష్, దేవరకొండ నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.