మణిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం.
సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కృషితో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు.
పెద్దమందడి,అక్టోబర్28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ కృషి మేరకు స్వచ్ఛంద సంస్థ సహకారంతో నూతన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కేంద్రం నిర్వహణకు అవసరమైన ఖర్చులను గ్రామపంచాయతీ తరఫున భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రేకుల షెడ్డులో ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్నందున, త్వరలో రేకులపై తెల్లరంగు పెయింట్ వేయించి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.స్వచ్ఛంద సంస్థ మేనేజర్ జూపల్లి పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు గ్రామ సర్పంచ్, పాఠశాల సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఎంఈఓ శాంతన్న మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, నస్రీన్‌లు సర్పంచ్‌కు, స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమం అనంతరం స్వచ్ఛంద సంస్థ మేనేజర్ జూపల్లి పురుషోత్తంను గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోతుల రాంరెడ్డి, ప్రతాప్ రెడ్డి, కొములయ్య, వెంకటయ్య, బాలరాజు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు సాగర్, ముప్పూరి బుచ్చన్న, తిరుపతయ్య, మందడి శ్రీను, బోయిన కృష్ణ, మొగిలయ్య, ఆనంద్ రెడ్డి, బీకే ప్రేమ్ కుమార్ రెడ్డి, వార్డు సభ్యురాలు జయమ్మ, మహిళా అధ్యక్షురాలు మంజులతో పాటు గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


Comments