బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలి.

సిబ్బందికి డీఈ ఆదేశం.

బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలి.

చిల్పూర్, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

వినియోగదారులు బకాయిలు లేకుండా విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని ఘనపూర్ డివిజన్ డీఈ బి.సారయ్య సూచించారు.
బుధవారం మండల కేంద్రంలోని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ఏడీఈ పి.రణధీర్ రెడ్డితో కలిసి విద్యుత్ సిబ్బందితో బకాయిలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ నెల చివరి వారం కావడంతో బకాయిల వసూళ్లు నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.బకాయిల వసూళ్లతో పాటు సిబ్బంది విధి నిర్వహణలో 'వన్ మినిట్ రూల్' విధానాన్ని తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఆదేశించారు. అర్నబ్ తుఫాన్ ప్రభావం డివిజన్ పరిధిలో పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వినియోగదారులు కూడా భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఎలాంటి సమస్యలు గుర్తించినా వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.వినియోగదారులు ఇంటి వద్ద నుండే మొబైల్, ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా బిల్లులు చెల్లించే సులభమైన పద్ధతులను ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాజవరం ఏఈ ఆర్.సురేష్, లైన్ ఇన్ స్పెక్టర్లు రామ్మూర్తి, కుమారస్వామి, కృష్ణంరాజు, లైన్ మెన్ లు గణేష్, సాంభరాజు, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.