పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
Views: 2
On
వేలేరు, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నాగూర్ల వెంకన్న తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలని, గ్రామస్థాయిలో అవగాహన కల్పించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో స్థానిక సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 Oct 2026 21:16:07
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్ షో (ఓపెన్ హౌస్)...


Comments