ముల్కనూరులో మెగా ఫిజియోథెరపీ శిబిరానికి విశేష స్పందన.
భీమదేవరపల్లి, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
ముల్కనూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన మెగా ఫిజియోథెరపీ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన ఈ శిబిరంలో సీనియర్ ఫిజియోథెరపీ వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ గుండు, ఆయన వైద్య బృందం పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీ చికిత్స, తగిన వైద్య సూచనలు అందించారు.
గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు కల్పించడంలో గ్రామపంచాయతీ చేస్తున్న కృషిపై హర్షం వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యమే గ్రామ ప్రగతికి పునాది అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడం విశేషం.


Comments