ఖమ్మం లో ఐ ఎఫ్ డబ్ల్యూ జె 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్.

ఖమ్మం లో ఐ ఎఫ్ డబ్ల్యూ జె 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

ఖమ్మం బ్యూరో , అక్టోబర్ 28(తెలంగాణ ముచ్చట్లు )

రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య పిలుపు మేరకు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) నిరంతరం పోరాటం చేస్తోందని, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ పేర్కొన్నారు. ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుధవారం టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్‌లో ఫౌండేషన్ చైర్మన్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు అన్నం శ్రీనివాసరావు ను షాలవతో సత్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అనాధలకు, పేదలకు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ మాట్లాడుతూ, 1950 అక్టోబర్ 28న ఢిల్లీలో స్థాపించబడిన  ఐఎఫ్‌డబ్ల్యూజే తొలి అధ్యక్షుడి గా ఏం.చలపతి రావు 5 సంవత్సరాలు కొనసాగారు. ఉపేందర్  వాజ్ పేయి స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఆ కాలం లో వివిధ  ప్రాంతీయ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లను కలుపుకొని ఈ కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఇది భారత దేశంలో మీడియా రంగం లో పని చేస్తున్న ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన మొట్ట మొదటి అతి పెద్ద జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ అంటూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం విశేషంగా కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్లు, అక్రెడిటేషన్ కార్డు లు, రైల్వే పాసుల కొరకు ఫెడరేషన్ గల్లి నుండి ఢిల్లీ వరకు పోరాటాలు చేస్తుందని  పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ, 
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, వృత్తి స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషకరమని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు పేదలకు సేవ చేయడం, పర్యావరణాన్ని కాపాడడం వంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ హెచ్-2843 జిల్లా ఉపాధ్యక్షులు లింగాల రామ్మూర్తి గౌడ్, కందనబోయిన నాగ కృష్ణ,కోశాధికారి వేములకొండ రమేష్, మామిడాల వీరబాబు, ఇసి మెంబర్ ఎలిశెట్టి రామకృష్ణ బాబు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎలుగోటి వెంకట్, కప్పల మధు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నల్లా రాకేష్, గుజ్జు గోపాల కృష్ణ, బంక మధు, టీబిజెఏ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కాసోజు, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ మరియు చిన్నంశెట్టి రాంబాబు, షేక్ మీరా, ఆముదాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.IMG-20261028-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.