హరీష్ రావు పర్యటనపై బీఆర్ఎస్ నేతల దిశానిర్దేశం.
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపైనా చర్చ
– జిల్లా బీఆర్ఎస్ నాయకులు
పెద్దమందడి,అక్టోబర్28(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ మంత్రి హరీష్ రావు వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు వెల్టూర్ గ్రామంలో సమావేశం నిర్వహించారు. పెద్దమందడి మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు యాదవ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ.. మండలంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు చేపట్టనున్న పర్యటనకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా నాయకులు ఇచ్చిన సూచనల మేరకు పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, కార్యకర్తలు అందరూ భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు అంశంపై చర్చించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి పట్టభద్రులకు అవసరమైన సమాచారం అందించి, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా కృషి చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో హరీష్ రావు పర్యటన ఏర్పాట్లు, రైతుల సమస్యల పరిశీలనతో పాటు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణు యాదవ్, జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments