వంగరలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ గజ్జెల సృజన రమేష్
భీమదేవరపల్లి, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, బొక్కల స్రవంతి, పూస కోయిల ప్రకాష్, మొండయ్య, రమేష్, సతీష్, శారద, అశోక్, చింతరాజు, జక్కుల అనిల్, వెంకటేష్, వ్యవసాయ శాఖ ఏఓ, ఏఈఓ, గ్రామ కార్యదర్శి, సీసీ సదానందం, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments