జమ్మికుంటలో ఈ నెల 15న ఉచిత మెగా వైద్య శిబిరం.
మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహణ.
జమ్మికుంట, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 15వ తేదీన ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని అంజలి కిడ్నీ కేర్ సెంటర్ సహకారంతో పట్టణ పరిధిలోని బాలికల పాఠశాలలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ గీతాంజలి నరేష్ (యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, కిడ్నీ సర్జన్), డాక్టర్ నరేష్ సముద్రాల (ఫ్యామిలీ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్) వైద్య సేవలు అందించనున్నారు.
కిడ్నీ సంబంధిత సమస్యలు, మూత్ర సంబంధిత వ్యాధులు, మహిళల ఆరోగ్య సమస్యలు, మధుమేహం తదితర ఆరోగ్య సమస్యలపై వైద్యుల సలహాలు, పరీక్షలు పొందేందుకు ఈ శిబిరం ఉపయోగపడనుంది.
పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందాలని నిర్వాహకులు కోరారు.


Comments