క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!

క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!

47 బంతుల్లో 90 పరుగులతో అజేయంగా నిలిచిన వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్

10 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సీఐ

గీసుగొండ, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): 

క్రికెట్ మైదానంలో వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్, సీఐ విశ్వేశ్వర్ తన బ్యాటింగ్‌ ప్రతిభతో అదరగొట్టారు. బంతిని బౌండరీ దాటిస్తూ సిక్సర్ల వర్షం కురిపించి తన సత్తా చాటారు.త్వరలో నిర్వహించనున్న ఐదో తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలకు సన్నాహకంగా ఏడు పోలీస్ బెటాలియన్ల క్రీడాకారులతో కూడిన రేంజ్-1 పోలీస్ జట్టుతో వరంగల్ పోలీస్ జట్టు సాధన మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్ విశ్వేశ్వర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
కేవలం 47 బంతులను ఎదుర్కొన్న ఆయన 10 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 90 పరుగులు సాధించారు. మైదానం నలుమూలలా బంతులను తరలిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఆయన ధాటికి మైదానంలో సిక్సర్ల మోత మోగింది.

ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌లో ఉత్తమ బ్యాటర్‌గా నిలిచిన విశ్వేశ్వర్ 8.95 అత్యుత్తమ ఆటగాడి రేటింగ్‌ను సైతం సాధించారు. ఆయన మెరుపు ఇన్నింగ్స్ వరంగల్ పోలీస్ జట్టులో నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా, రాబోయే రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో సత్తా చాటేందుకు జట్టు సభ్యుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.విధి నిర్వహణలోనే కాదు.. క్రీడా మైదానంలోనూ సీఐ విశ్వేశ్వర్ తనదైన ముద్ర వేస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!