అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
రక్తసంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పే భాతృ ద్వితీయ..
అన్నదమ్ముల ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ అక్కాచెల్లెళ్ల ఆప్యాయత..
హనుమకొండ, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ సంప్రదాయంలో కుటుంబ బంధాలకు, రక్తసంబంధాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆత్మీయతను తరతరాలకు గుర్తుచేసే పండుగే భగినీ హస్త భోజనం. దీనినే యమ ద్వితీయ, భాతృ ద్వితీయ, ఉత్తర భారతదేశంలో భాయిదూజ్ అని కూడా పిలుస్తారు. దీపావళి పండుగ అనంతరం వచ్చే ఈ పర్వదినం తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
యమధర్మరాజు – యమున అనుబంధమే ఈ పండుగకు ఆధారం!
పురాణ గాథల ప్రకారం సూర్యభగవానుడి సంతానమైన యమధర్మరాజు, యమునలకు అన్నాచెల్లెళ్ల అనుబంధం ఉండేది. తన అన్నను ఎంతో ప్రేమించే యమున, ఒకసారి తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఆహ్వానించింది. చెల్లెలి ఆహ్వానాన్ని మన్నించిన యమధర్మరాజు ఆమె ఇంటికి చేరుకోగా, యమున సాదరంగా స్వాగతం పలికి తన చేతులతో తయారుచేసిన వంటకాలను ప్రేమగా వడ్డించింది.
చెల్లెలి ఆప్యాయతకు సంతోషించిన యముడు ఏదైనా వరం కోరుకోమని అడగగా, ప్రతి ఏడాది ఇదే రోజున తన ఇంటికి రావాలని యమున కోరినట్లు పురాణ గాథ చెబుతోంది. అందుకు యముడు అంగీకరించడంతో పాటు, ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసే సోదరులకు అకాల మృత్యుభయం తొలగి ఆయురారోగ్యాలు కలగాలని వరం ఇచ్చినట్లు సంప్రదాయ విశ్వాసం. అందుకే ఈ రోజును యమ ద్వితీయగా పిలుస్తారు.
శ్రీకృష్ణుడు – సుభద్ర కథనం కూడా ప్రచారంలో..
మరో ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం నరకాసురుడిని సంహరించి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడిని ఆయన సోదరి సుభద్ర ఇదే రోజున సాదరంగా ఆహ్వానించి, హారతి ఇచ్చి స్వాగతం పలికిందని చెబుతారు. ఈ కథనం కూడా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఈ పండుగలో ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
బంధాలను కలిపే గొప్ప సంప్రదాయం..
వివాహం అనంతరం ఆడపిల్లలు పుట్టింటికి దూరంగా ఉంటూ తమ కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమవుతారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎప్పుడూ కలుసుకోవడం సా


Comments