ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి.

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

వేలేరు, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ సక్రమంగా జరగాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
అనంతరం వేలేరు రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెక్కులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రతి నెలా సుమారు రూ.3 కోట్ల మేర సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్, తహశీల్దార్ కోమి, ఏఓ అనిత, ఎంపీడీఓ కిషన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.IMG-20261111-WA0016

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!