బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు.
ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి లింగంనేని నళినిశ్రీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది, అధ్యాపకులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ప్రిన్సిపాల్ శ్రీమతి నళినిశ్రీ మాట్లాడుతూ, భారతదేశ విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యావ్యవస్థ పటిష్టతకు బలమైన పునాదులు వేశారని తెలిపారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి, దేశ పురోగతికి దోహదపడే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ ఎ. మోహన్, అధ్యాపకులు జోనతాన్ బాబు, లక్ష్మీకాంతం, పద్మావతి, రామకృష్ణ, రమేష్, రాజేంద్ర, ప్రియకుమార్ రెడ్డి, మురళీకృష్ణ, యశోద, శాంతిప్రియ, యూడీసీ మదర్ సాహెబ్, జశ్వంత్, బుజ్జమ్మ, అరుణ తదితరులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.


Comments