ఇల్లందకుంటలో గ్రామీణ యువతకు ఉచిత ఏఐ శిక్షణ కేంద్రం.

గ్రామీణ యువతకు ఉచిత ఏఐ శిక్షణ అందించడమే లక్ష్యం.

ఇల్లందకుంటలో గ్రామీణ యువతకు ఉచిత ఏఐ శిక్షణ కేంద్రం.

ఇల్లందకుంట, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్య, వ్యవసాయం, వైద్యం సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయని యాప్ టీవీ అధినేత ఉదయానంద రెడ్డి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత యువతకు సైతం ఏఐపై అవగాహన, నైపుణ్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో ఉచిత ఏఐ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత వరకు ఈ కేంద్రంలో ఉచితంగా ఏఐ శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల విద్యార్థులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా ఆధునిక సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో వీణవంక మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురు యువతకు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు సహకరించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో హుజూరాబాద్ కేంద్రంగా కూడా ఉచిత ఏఐ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
గ్రామీణ యువత సాంకేతిక రంగంలో ముందంజ వేయడంతో పాటు భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉదయానంద రెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!