నిరంజన్ రెడ్డిపై ఎస్పీకి కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

నిరంజన్ రెడ్డిపై ఎస్పీకి కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు.

వనపర్తి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ నాయకులపై చెప్పులతో దాడి చేస్తానంటూ 1,000 మందితో కలిసి దాడి చేస్తానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు జిల్లా ఎస్పీ సునీతారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఎస్పీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.జిల్లా ఎస్పీ సమక్షంలోనే ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజలు, యువత, రాజకీయ పార్టీల కార్యకర్తలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న వ్యాఖ్యలను సుమోటోగా పరిగణించి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల్లో ఉద్రిక్తతలు పెంచే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బ్రహ్మంచారి, అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, కౌన్సిలర్లు పరుశురాములు, క్రాంతి గౌడ్, రాజు యాదవ్, నందిపేట తిరుపతయ్య, భాను తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!