మత్తు రహిత తెలంగాణ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలి.

పలుస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .

మత్తు రహిత తెలంగాణ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలి.

వనపర్తి,నవంబర్11(తెలంగాణ ముచ్చట్లు): 

మత్తు రహిత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా నియమితులైన పోచ రవీందర్ రెడ్డిని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ, పోచ రవీందర్ రెడ్డి నియామకం తెలంగాణ యువతకు శుభపరిణామమని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. మత్తు రహిత తెలంగాణ లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణానికి విస్తరించాలని పిలుపునిచ్చారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలు, సంస్కృతి వైపు దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు బండారు శ్రీనివాస్, జి.జె. శ్రీనివాస్, వెంకట రమణ, రాజు, భరత్ కుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!