మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో స్పోర్ట్స్ డే.

విద్యార్థినులతో కలిసి వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.

మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో స్పోర్ట్స్ డే.

మానకొండూర్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేకంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన క్రీడా కార్యక్రమాలను ప్రారంభించి విద్యార్థినులకు ఆశీర్వచనం అందించారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందుతాయని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.

కార్యక్రమం అనంతరం డా. కవ్వంపల్లి సత్యనారాయణ విద్యార్థినులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థినులతో సమానంగా క్రీడల్లో పాల్గొని వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థినుల ప్రతిభ, సాధనలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!