జాతీయ జర్నలిస్టుల పురస్కారం–2026 అందుకున్న ధనుష్.

అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది.

జాతీయ జర్నలిస్టుల పురస్కారం–2026 అందుకున్న ధనుష్.

కొత్తకోట,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం మరింత కృషి చేస్తానని దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి, వనపర్తి జర్నలిస్టు ధనుష్ అన్నారు. జర్నలిస్టుల జాతీయ పురస్కారం అందుకోవడం తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల పురస్కారం–2026ను ధనుష్ అందుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు మోహన్ కృష్ణ, మాజీ డీఐజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ధనుష్‌తో పాటు దళిత్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్, ప్రధాన కార్యదర్శి అంకూర్ డేవిడ్, ఉపాధ్యక్షుడు మీసాల ఎల్లేష్ కూడా పురస్కారాలను అందుకున్నారు.ఈ సందర్భంగా జర్నలిస్టు ధనుష్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల సాధన కోసం నిరంతరం చేస్తున్న పోరాటాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం సంతోషంగా ఉందన్నారు. అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం ధనుష్ చేస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!