స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.

పలు రకాల పోటీలలో సృజనాత్మకతను చాటిన చిన్నారులు.

స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.

ఖమ్మం బ్యూరో,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు )

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం జాతీయ బాలల దినోత్సవం ఆనందోత్సాహాలతో నిర్వహించారు. తొలుత చాచా నెహ్రూ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్    చింతనిప్పు కృష్ణ చైతన్య,  పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్యలు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. పిల్లలలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి నిర్వహించిన ఈ పోటీలలో చిన్నారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. 
ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో చిన్నారులు వివిధ రకాల వేషధారణలతో అలరించారు. విద్యార్థులకు నిర్వహించిన ఆటలు పోటీలు, చెస్ పోటీలలో తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో చిన్నారులు పాల్గొని తమ ఆలోచనలకు పదును పెట్టారు. అనంతరం వివిధ పోటీలలో విజయం సాధించిన పాఠశాల విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ నవంబర్ 14 బాలలందరికి గొప్ప పండుగ అని, విద్యార్థుల సృజనను వెలికి తీయడానికి బాలల దినోత్సవం దోహద పడుతుందని తెలిపారు. స్వతంత్ర్య భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, పిల్లలను గులాబీ పూలు లాగా భావించి వారి సున్నిత మనసులు వికసించేలా పిల్లల దినోత్సవం ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. మహనీయుల జీవితాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనపు సుకన్య ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.IMG-20261114-WA0022

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు. రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు.
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్* *సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు* హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌కు జమాతే ఇస్లామీ హింద్ మహిళల అభినందన.
రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 
ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.
సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.