రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 

ఖమ్మం బ్యూరో, నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు )

తల్లాడ మండలం పినపాక గ్రామానికి చెందిన తెల్లపొట్ట మురళి కృష్ణ అనే వ్యక్తి  తనకు తానుగా  రౌడీ గా చిత్రీకరించుకొని రౌడీ గ్యాంగుల పేరుతో చలామణి అవుతూ, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోస్టులు పెడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న వ్యక్తిని ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.ప్రస్తుతం ఖమ్మం బస్ డిపో నివాసం ఉంటున్న మురళి కృష్ణ ను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రౌడీయిజాన్ని ప్రదర్శించడం, ప్రజలను భయపెట్టేలా పోస్టులు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ  హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు. రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు.
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్* *సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు* హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌కు జమాతే ఇస్లామీ హింద్ మహిళల అభినందన.
రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 
ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.
సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.