సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.

సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.

కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలి

జిల్లా సగర సంఘం అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్

వనపర్తి,నవంబర్14(తెలంగాణ ముచ్చట్లు):

సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలనే డిమాండ్ సాధన కోసం సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సగర సంఘం అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్ పిలుపునిచ్చారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని మారికుంట జిల్లా సగర కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగరుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి సగర సంఘం నాయకులు, యువజన నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సగర కులస్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలనే డిమాండ్‌ను సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు. సంఘటిత శక్తితో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ధర్నాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సగర సంఘం ప్రధాన కార్యదర్శి గొబ్బూరి చంద్రయుడు, జిల్లా కోశాధికారి గుంటి సత్యం సాగర్, జిల్లా ముఖ్య సలహాదారుడు పల్లె సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకా సత్యం సాగర్, రాష్ట్ర కోశాధికారి చీర్ల విష్ణు, రాష్ట్ర నాయకులు పెబ్బేరు శ్రీనివాసులు సాగర్, వనపర్తి మండల అధ్యక్షుడు చీర్ల ఆంజనేయులు సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, వనపర్తి పట్టణ అధ్యక్షుడు బుజ్జన్న, వనపర్తి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చీర్ల శ్రీనివాసులు, సోషల్ మీడియా ఇన్‌చార్జి కొమ్ముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు. రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు.
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్* *సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు* హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌కు జమాతే ఇస్లామీ హింద్ మహిళల అభినందన.
రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 
ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.
సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.