జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి పర్యటన.

జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి పర్యటన.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు )

రాష్ట్ర రెవెన్యూ,  గృహ నిర్మాణం, సమాచార,  పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. తొలుత ఉదయం 11:30 గంటలకు కూసుమంచి మండలంలోని నేలపట్ల గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పోతురాజు దేవాలయ విగ్రహ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరావుతారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో, ఖమ్మం నగరంలో పలు శుభ కార్యక్రమాలకు వెళతారు.  మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో, సాయంత్రం 4:40 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో చేయూత పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. రాత్రి 8:20 గంటలకు ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ లో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు. రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు.
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్* *సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు* హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌కు జమాతే ఇస్లామీ హింద్ మహిళల అభినందన.
రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 
ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.
సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.