బీజేపీ చిల్పూర్ మండల నాయకుల ముందస్తు అరెస్టు.
నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
హనుమకొండ, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ చిల్పూర్ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు.శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, అటువంటి ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. నిరసన తెలిపే హక్కును హరించేలా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోలీసులు నిర్బంధించిన బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, జిల్లా నాయకుడు బాల్నే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాలని కోరారు.


Comments