ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
Views: 1
On
ఖమ్మం బ్యూరో, నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు )
వార్షిక తనిఖీలలో భాగంగా ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, పెండింగ్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సిఐలు ముష్కరాజు, మురళి, సాగర్, సంజీవ్, డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 Nov 2026 20:05:43
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్*
*సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు*
హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ...


Comments