ఈ నెల 22న ఘనంగా కరీంనగర్ సదర్ సమ్మేళనం.
సదర్ ఉత్సవాలకు రావాలని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుకు ఆహ్వానం.
కరీంనగర్, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ సదర్ కమిటీ, ఆల్ ఇండియా మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం నగరంలోని సర్కస్ గ్రౌండ్ (జ్యోతిబా పూలే మైదానం)లో సదర్ సమ్మేళన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావును సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా భగత్‌నగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో సదర్ ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకల నిర్వహణకు సంబంధించిన విశేషాలను వివరించారు. ఉత్సవాలకు తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.
దీనిపై యాదగిరి సునీల్ రావు సానుకూలంగా స్పందిస్తూ, సదర్ ఉత్సవాల విజయవంతానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు సందబోయిన రవి యాదవ్, సందబోయిన ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Comments