రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌కు జమాతే ఇస్లామీ హింద్ మహిళల అభినందన.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు )
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందుకున్న మైనారిటీ గురుకుల పాఠశాల-2 ప్రిన్సిపల్ పి. సీతామహాలక్ష్మిని జమాతే ఇస్లామీ హింద్ మహిళా సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం పీఆర్ కన్వీనర్ హాజిరా సదఫ్, సౌత్ అధ్యక్షురాలు నాజియా తబస్సుం, పీఆర్ సభ్యులు జహెరా ఫాతిమా, ఫైజా ఇరం,షబానా తదితరులు ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మికి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి అభినందించారు.
అనంతరం హాజిరా సదఫ్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడం, విద్యా ప్రమాణాలను పెంపొందించడం, వారి సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రిన్సిపల్ చేసిన విశేష కృషికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిస్తూ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ అవార్డు ఆమె అంకితభావానికి, నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొంటూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ అఖిల, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ అనిత ఉపాధ్యాయులు, విద్యార్థినులు మరియు జమాతే ఇస్లామీ హింద్ మహిళా సభ్యులు పాల్గొన్నారు.


Comments