రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు.
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్*
*సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు*
హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కానిగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర సగర సంఘం కార్యవర్గం ఆమోదించిన తీర్మానం మేరకు ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకంతో హుజురాబాద్ ప్రాంతానికి చెందిన నాయకుడికి రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు దక్కడం పట్ల సగర సంఘం నాయకులు, కుల బాంధవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కానిగంటి శ్రీనివాస్ గత అనేక సంవత్సరాలుగా సగర కుల అభ్యున్నతి, సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. సంఘం అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించి సంఘం బలోపేతానికి విశేష సేవలందించారు. ఆయన అనుభవం, సేవా దృక్పథం, సంఘం పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కోశాధికారిగా కీలక బాధ్యతలు అప్పగించింది.


Comments