వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించాలి.

పంచాయతీ కార్యదర్శి వెంకటేష్.

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించాలి.

పెద్దమందడి,నవంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని, వర్షపు నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ సూచించారు. దొడగుంటపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించడం వల్ల భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్యను కొంతవరకు నివారించవచ్చని తెలిపారు.ప్రతి ఇంటి యజమాని ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News